భారతదేశం, జనవరి 27 -- బడ్జెట్‌పై అన్ని వర్గాల్లోనూ అంచనాలు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు రోజులు దగ్గరకు వచ్చాయి. రైతులకు సంబంధించిన కాస్త ఎక్కువే అంచనాలు ఉన్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఎలాంటి కేటాయింపులు చేస్తుందనే అంశంపై కూడా చర్చ ఉంది.

ఈ బడ్జెట్‌లో వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోందని చాలా మంది భావిస్తున్నారు. రైతులను ఆదుకునేందుకు కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని మోదీ ప్రభుత్వం యోచిస్తోంది. గత బడ్జెట్‌ల మాదిరిగానే ఈ బడ్జెట్‌లో కూడా వ్యవసాయ రంగానికి మేలు చేసే కీలక ప్రకటనలు ఉంటాయని భావిస్తున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి పెంపు, వ్యవసాయ ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గింపు, వ్యవసాయానికి సబ్సిడీ ప...