భారతదేశం, జనవరి 29 -- Union Budget 2025: సాధారణంగా వారాంతాలైన శని, ఆదివారాలు భారతీయ స్టాక్ మార్కెట్లు మూసివేసి ఉంటాయి. ఆ రెండు రోజులు ట్రేడింగ్ ఉండదు. కానీ, ఈ శనివారం, ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు. మరి, ఆ రోజు స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ కోసం తెరిచి ఉంటాయా?

ఫిబ్రవరి 1వ తేదీ, శనివారం స్టాక్ మార్కెట్లు తెరిచి ఉంటాయా? అనే విషయంపై నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వివరణ ఇచ్చింది. ఎన్ఎస్ఈ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఫిబ్రవరి 1 వ తేదీ, శనివారం, స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ కోసం తెరిచి ఉంటాయి. ఆ రోజు ట్రేడింగ్ సమయం ఉదయం 9:15 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఉంటుంది. సాధారణంగా వారాంతాల్లో క్లోజ్ అయ్యే స్టాక్ మార్కెట్లు (stock market) అప్పుడప్పుడు ...