Hyderabad, ఫిబ్రవరి 1 -- ఎర్రటి బ్రీఫ్ కేస్ లేదా ఫైల్ పట్టుకొని బడ్జెట్ రోజున కేంద్రమంత్రి సీతారామన్ మీడియాకు కనిపిస్తారు. అదే కేంద్ర బడ్జెట్ ఉన్న బ్రీఫ్ కేస్. దీన్ని బడ్జెట్ బండిల్ అని కూడా అంటారు. దాని కవర్ ఎప్పుడూ ఎరుపు రంగులోనే ఉంటుంది. కేంద్ర బడ్జెట్ ఎవరు సమర్పించినా కూడా ఆ బడ్జెట్ పత్రాలు లేదా సమాచారం ఉన్న ఫైలు, బ్రీఫ్ కేసు, బండిల్ అనేవి ఎరుపు రంగులోనే ఉంటాయి. ఇలా ఎరుపు రంగులోనే ఆ బ్రీఫ్ కేసు ఉండడానికి కారణం ఏంటో తెలుసా.

ఎరుపు రంగు కేవలం డేంజర్ అని చెప్పడానికి సూచిస్తారని అనుకుంటారు. నిజానికి ఎరుపు రంగు ఉత్సాహాన్ని, అదృష్టాన్ని, సాహసాన్ని, కొత్త జీవితాన్ని సూచిస్తుంది. మతపరమైన పండుగలలో ఎరుపు రంగుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎరుపు రంగు అనేది శక్తిని సూచిస్తుంది. ఈ రంగు శాశ్వతత్వాన్ని, పునర్జన్మను కూడా సూచిస్తుంది. అందుకే ఎరుపు రంగుకు హి...