భారతదేశం, జనవరి 31 -- Budget 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు యూనియన్ బడ్జెట్ 2025 ను ప్రవేశపెట్టనున్నారు. ఇది గత సంవత్సరం మధ్యంతర బడ్జెట్ తో సహా నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన వరుసగా ఎనిమిదో బడ్జెట్. గత బడ్జెట్ లలో పలు కీలక సంస్కరణలను తీసుకువచ్చారు. ఉదాహరణకు 2020లో కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టగా, 2024లో క్యాపిటల్ గెయిన్ స్ట్రక్చర్ ను పునరుద్ధరించారు. గత కొన్నేళ్లుగా ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన కీలక సంస్కరణల గురించి క్లుప్తంగా వివరిస్తున్నాం. ఇవి వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులను గణనీయమైన రీతిలో ప్రభావితం చేశాయి.

1. కొత్త ఆదాయ పన్ను విధానం: 2020 బడ్జెట్ లో కొత్త పన్ను విధానాన్ని ఆప్షనల్ విధానంగా ఆర్థిక మంత్రి ప్రకటించారు. కొన్ని మినహాయింపుల ప్రయోజనాలను తొలగిస్తూ రాయితీ పన్ను రేట్లను అందించే పన్ను వ్యవస్థను సరళతరం చే...