భారతదేశం, జనవరి 29 -- Budget 2025: బడ్జెట్ 2025కు కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. కేంద్ర బడ్జెట్ 2025 ను పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి గడువు సమీపిస్తున్నందున.. ఆ బడ్జెట్ లో ప్రభుత్వం తీసుకురాబోయే కీలక నిర్ణయాలపై ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మునుపటి ఆదాయపు పన్ను వ్యవస్థను పూర్తిగా రద్దు చేయనున్నారన్నది ఆ ఊహాగానాల్లో ప్రధానమైనదిగా ఉంది. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరగడం, సరళీకృత, పారదర్శక విధానాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకురావడంతో, పాత పన్ను విధానాన్ని తొలగిస్తారని తొలగిపోవచ్చని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు.

కొత్త పన్ను విధానం పట్ల ప్రభుత్వ పక్షపాత వైఖరి, దాన్ని ఎంచుకునే వారి సంఖ్య పెరగడం, కొత్త విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి పాత విధానంలో వివిధ మినహాయింపుల పరిమితు...