భారతదేశం, ఏప్రిల్ 13 -- ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచడంతో భారతదేశం అంతటా లక్షలాది మంది మొబైల్ వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ బీఎస్‌ఎన్‌ఎల్ అత్యంత సరసమైన లాంగ్-వాలిడిటీ ప్లాన్‌లతో కస్టమర్ల హృదయాలను గెలుచుకుంటోంది. కేవలం కేవలం 397 రూపాయలతో 150 రోజుల వాలిడిటీ ప్లాన్ తీసుకొచ్చింది.

బీఎస్ఎన్ఎల్ 150 రోజుల చెల్లుబాటుతో ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ లో మీకు అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. కొన్ని రోజుల క్రితం, బీఎస్ఎన్ఎల్ తన రెండు ప్లాన్ల చెల్లుబాటును 30 రోజులు తగ్గించింది . దీని తరువాత జియో, ఎయిర్‌టెల్ మాదిరిగానే బీఎస్‌ఎన్‌ఎల్ కూడా అదే మార్గాన్ని అనుసరిస్తుందా అని వినియోగదారులు ఆందోళన చెందారు. అయితే ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ 150 రోజుల పాటు ఉండే ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ...