Hyderabad, మార్చి 31 -- నోరు పరిశుభ్రంగా ఉండడం చాలా ముఖ్యం. నోటిని శుభ్రంగా ఉంచుకోకపోతే నోటి దుర్వాసన, దంతక్షయం వంటి సమస్యలు వస్తాయని అందరికీ తెలిసిందే. అలాగే మనం తినే ఆహారంతో పాటు నోటిలోని క్రిములు కూడా మన పొట్టలోకి చేరి అనారోగ్యానికి దారితీస్తుంది. అలాగే నోరు పరిశుభ్రంగా లేకపోతే కావిటీ సమస్యలు వచ్చి భరించలేని నొప్పిని కలిగిస్తాయి.ఆహారాన్ని సరిగ్గా నమలలేకపోవడం, తినలేకపోవడం వల్ల కూడా అజీర్ణం వస్తుంది. అందుకోసం దంతవైద్యులు ఉదయం, రాత్రి రెండు పూటలా పళ్లు తోముకోవాలని సూచిస్తున్నారు.

కానీ కొంతమంది ఉదయం పళ్ళు తోముకుంటారు, కానీ రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోవడం మర్చిపోతారు. నోటి పరిశుభ్రత లేకపోవడం వల్ల కావిటీ సమస్యలే కాదు ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇది మీ ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది

రాత్రి పడుకునే ముందు మీ దంతాలను బ...