Warangal, ఏప్రిల్ 12 -- బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ నిర్వహణపై ఇంకా అడ్డంకులు తొలగలేదు. సభ నిర్వహణకు ఇంకో 15 రోజుల సమయమే ఉండగా, ఇంతవరకు వరంగల్ పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు హై కోర్టు మెట్లెక్కారు. ఈ మేరకు శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు బీఆర్ఎస్ సభకు పర్మిషన్ విషయంలో వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వరంగల్ పోలీస్ కమిషనర్ కు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. పర్మిషన్ జాప్యంపై పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఏప్రిల్ 17వ తేదీకి వాయిదా వేసింది.

బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద రజతోత్సవ మహా సభకు పార్టీ అధిష్ఠానం ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎల్కతుర్తి, చింతల పల్లి గ్రామాల మధ్య ఏర్పాట్లు కూడా మొదలు పెట్టారు. అక్కడి రైతులతో మా...