Warangal, ఏప్రిల్ 13 -- బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబరానికి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. ఏప్రిల్ 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి సమీపంలో నిర్వహించనున్న సభకు అనుమతులు ఇస్తూ వరంగల్ పోలీసులు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఈ మేరకు పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఒడితల సతీశ్ కుమార్, ఇతర నేతలకు వరంగల్ కమిషనరేట్ పరిధి కాజీపేట ఏసీపీ తిరుమల్ పర్మిషన్ కాపీలను అందజేశారు.

దీంతో కొద్దిరోజులుగా బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహణపై నెలకొన్న సందిగ్ధానికి ఎట్టకేలకు తెరపడినట్లయ్యింది. ఇదిలాఉంటే ఇప్పటికే బహిరంగ సభ నిర్వహణ కోసం బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా.. రాష్ట్ర ప్రభుత్వానికి, వరంగల్ సీపీ హైకోర్టుకు వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సభ న...