భారతదేశం, మార్చి 31 -- సభ నిర్వహణకు స్థలం ఖరారు కాగా.. ఇక ఏర్పాట్లపై ఆ పార్టీ నేతలు ఫోకస్ పెట్టారు. దాదాపు 10 లక్షల మంది తరలివచ్చే అవకాశం ఉందని, సభ, ఇతర అవసరాలకు దాదాపు 1200 ఎకరాల వరకు అవసరమని అంచనా వేశారు. ఈ మేరకు రెండు రోజుల కిందట ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, వొడితెల సతీశ్ బాబు, దాస్యం వినయ్ భాస్కర్, ఇతర నేతలంతా కలిసి రూట్ మ్యాప్ తో పాటు సభ నిర్వహణ స్థలాన్ని పరిశీలించారు.

పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు భారీ జన సమీకరణపైనా దృష్టి పెట్టారు. ఈ రజతోత్సవ సభతో పార్టీ సత్తా చాటాలనే ఉద్దేశంతో భారీ ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఎండలు మండుతుండటం, ఏప్రిల్ చివరి నాటికి మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండటంతో.. దానికి అనుగుణంగా సౌకర్యాలు కల్పించేందుకు రెడీ అవుతున్నారు.

బీఆర్ఎస్ బహిరంగ సభక...