భారతదేశం, ఏప్రిల్ 7 -- కొద్దిరోజుల కిందటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బహిరంగ సభ నిర్వహణకు అనుమతి కోసం కాజీపేట ఏసీపీ తిరుమల్‌కు వినతి పత్రం అందించారు. ఇంతవరకు దానికి సంబంధించిన అనుమతులు రాకపోవడం, ఇంతలోనే వరంగల్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తూ.. సీపీ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేయడంతో బీఆర్ఎస్ నేతల్లో అయోమయం మొదలైంది. దీంతోనే రజతోత్సవ సభ జరుగుతుందా.. లేదా అనే చర్చ జరుగుతోంది.

2001లో బీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది. ఈ ఏడాది ఏప్రిల్ 27వ తేదీన సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసుకుంటోంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో ఈ సభను నిర్వహించాలని భావించింది. ఈ మేరకు పనులు కూడా స్టార్ట్ చేసింది. దాదాపు 1,213 ఎకరాల్లో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టి...