భారతదేశం, ఏప్రిల్ 8 -- వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా.. ప్రజలకు సమస్యలు రాని ప్రాంతంలో సభ నిర్వహణ జరుగుతుందని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. 1200 ఎకరాల్లో పార్కింగ్‌తో పాటు సభ ఏర్పాట్లు అన్ని బాగా జరుగుతున్నాయని వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ అయ్యారు. సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేశారు.

'తెలుగునాట విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న రెండు పార్టీలు తెలుగుదేశం, బీఆర్ఎస్ మాత్రమే. అందుకే ఏడాదిపాటు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తాం. ఆర్టీసీ ద్వారా 3000 బస్సుల కోసం విజ్ఞప్తి చేశాను. ఆర్టీసీ సూత్రప్రాయంగా అంగీకరించింది. 27వ తేదీ ఆదివారం కావడం, విద్యార్థులకు సెలవులు ఉండటం వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగవు' అని కేటీఆర్ స్పష్టం చేశారు.

'మా ...