భారతదేశం, జనవరి 22 -- BRS Rythu Maha Dharna : బీఆర్ఎస్ రైతు మహా ధర్నాకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 28న నల్గొండలో సభ నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది. నల్గొండ క్లాక్‌టవర్‌ సెంటర్‌లో రైతు మహాధర్నా నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. బీఆర్ఎస్ రైతు మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించకపోవడంతో ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ నెల 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మహాధర్నా కార్యక్రమానికి అనుమతినిచ్చింది. మహా ధర్నాలో బీఆఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు ముఖ్యనేతలు, రైతులు పాల్గొననున్నారు.

"నల్గొండలో బీఆర్ఎస్ మహాధర్నాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రకాలుగా అడ్డుకోవాలని చూసినా చివరికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. కాంగ్రెస్‌ సర్కార్‌ రైతులకు ఇచ్చిన ఎన్నికల హామ...