తెలంగాణ,హైదరాబాద్, మార్చి 8 -- తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు కంకణబద్దులమై మరింతగా పోరాడాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ తెలంగాణ సమాజ రాజకీయ అస్తిత్వ పార్టీ అని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో ముఖ్య నేతలతో సమావేశమైన కేసీఆర్. పార్టీ రజతోత్సవ వేడుకల నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొదటినుండి కాపాడుకుంటూ వస్తున్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని చెప్పారు.

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 27 ఏప్రిల్ తేదీకి 25 ఏండ్లు కావొస్తుంది. ఈ నేపథ్యంలో నిర్వహించే రజతోత్సవ వేడుకల్లో భాగంగా.. వరంగల్ జిల్లాలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈమేరకు వరంగల్ సమీపంలో విశాలమైన అనువైన ప్రదేశాలను పరిశీలించి. త్వరలో సభా వేదిక స్థలాన్ని ...