తెలంగాణ,వరంగల్,జనగాం, ఫిబ్రవరి 13 -- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూ వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కూడా పింక్ బుక్ మెయింటైన్ చేస్తామని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చాక ఇంతకింత చెల్లిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.

రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతుంటారని. కానీ తెలంగాణలో రేవంత్‌రెడ్డి మాత్రం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని కవిత ఫైర్ అయ్యారు. ఫేస్ బుక్ లో చిన్న పోస్ట్ పెడితే కూడా కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. తాము కూడా లెక్కలు రాసి పెట్టుకుంటామని. అందరి లెక్కలు తేలుస్తామన్నారు.

బీసీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపి చేతులు దులుపుకుంటే కుదరదని కవిత వ్యాఖ్యానించారు. ఒక బిల్లు కాదు.. మూడు వేర్వేరు బిల్లులు పెట్టాలన్నారు. విద్యలో 46 శ...