భారతదేశం, మార్చి 25 -- BRS Meeting Venue: బీఆర్‌ఎస్‌ రజతోత్సవ వేడుకల్ని వరంగల్‌ బదులు ఘట్‌కేసర్‌లో నిర్వహించాలని ఆ పార్టీ భావిస్తోంది. తొలుత వరంగల్‌లో నిర్వహిస్తారని ప్రచారం జరగడంతో ఈ మేరకు స్థానిక బీఆర్ఎస్ నేతలు వరంగల్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న దేవన్నపేట, కడిపికొండ సమీపంలోని భట్టుపల్లి స్థలాన్ని కూడా పరిశీలిస్తున్నారు.

అనూహ్యంగా పార్టీ అధినేత కేసీఆర్ సభ నిర్వహణ స్థలాన్ని మార్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మేడ్చల మల్కజ్ గిరి జిల్లా పరిధి ఘట్ కేసర్ సమీపంలో సభ నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు అక్కడి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు సభ నిర్వహణకు అనువైన స్థలాన్ని పరిశీలించాల్సిందిగా సూచించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. సభా స్థలం మార్పుపై అధికారికంగా పార్టీ నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడనప్పటికీ.. ఘట్ కేసర్‌ ను ఫైనల్ చే...