భారతదేశం, ఏప్రిల్ 2 -- BRS Meeting : బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు అంకురార్పణ జరిగింది. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా గులాబీ దళపతి కేసీఆర్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 27న దాదాపు 1,213 ఎకరాల్లో సుమారు 10 లక్షల మందితో రజతోత్సవ మహా సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి వద్ద రజతోత్సవ మహాసభ నిర్వహించనుండగా.. ఈ మేరకు బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలంతా కలిసి చింతలపల్లి వద్ద శాస్త్రోక్తంగా పూజలు చేశారు.

అనంతరం భూమి పూజ నిర్వహించి, బహిరంగ సభ పనులకు శ్రీకారం చుట్టారు. స‌భా వేదిక నిర్మాణ ప‌నుల‌కు కొబ్బరి కాయ‌లు కొట్టి పనులు ప్రారంభించారు. దీంతో రజతోత్సవ మహా సభకు అంకురార్పణ జరిగినట్లు పార్టీ నేతలు స్పష్టం చేశారు.

తెలంగాణ స్వ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర...