భారతదేశం, ఫిబ్రవరి 10 -- BRS KTR At Chilukur: చిలుకూరులో ఇటీవల దాడికి గురైన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్. రంగరాజన్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని దాడి చేసిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరులో రెండు రోజుల క్రితం కొందరు సీఎస్. రంగరాజన్‌ పై దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో పూర్తిగా క్షీణించిన శాంతిభద్రతల పరిస్థితికి ఈ దాడి సంఘటన నిలువెత్తు నిదర్శనమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాడి చేసిన వారు ఏ ముసుగులో ఉన్నా, ఏ ఎజెండాతో ఇలాంటి దారుణానికి ఒడిగట్టినా, వారిని ఉక్కుపాదంతో అణచివేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. భగవంతుని సేవలో నిమగ...