భారతదేశం, ఫిబ్రవరి 26 -- BRS Kavitha: ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో మొదలైన అభివృద్ధి పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారిన అభివృద్ధి కొనసాగాలని అన్నారు.

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ....తెలంగాణకు కొంగుబంగారం లాంటి రాజరాజేశ్వర స్వామి వారి కరుణాకటాక్షాలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. వేములవాడ అభివృద్ధికి కేసిఆర్ గారు ఎంతో కృషి చేశారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం కేసీఆర్ రూ. 250 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు.

ప్రభుత్వాలు మారినంత మాత్రాన అ...