భారతదేశం, ఫిబ్రవరి 10 -- BRS Harish Rao: సార్వత్రిక ఎన్నికల సమయంలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ అనేక హామీలను ఇచ్చిందని అందులో 2లక్షల రూపాయల రుణమాఫీ అంతంత మాత్రమే పూర్తి చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రైతు భరోసా పెట్టుబడి సాయానికి కోతలు పెట్టారని ఇప్పుడేమో సన్నవడ్లకు ఇస్తానన్న బోనస్ డబ్బులను బోగస్ అన్నట్లుగా ఎగవేస్తున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ బోనస్ హామీ ఒక బోగస్ హామీగా మారిపోయిందని హరీష్‌ రావు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8,64,000 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబందించిన 432 కోట్ల రూపాయల బోనస్ చెల్లింపులు పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. వరి ధాన్యం కొనుగోలు నిలిపివేసి దాదాపు 50 రోజులు గడిచినా ఇంత వరకు రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ కాలేదని రెండో పంటకు సిద్దం కావాల్సిన రైతులు బోనస్ డబ్బుల కో...