భారతదేశం, జనవరి 1 -- మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు కేసీఆర్ పెట్టిన సంతకం ఏపీకి అడ్వాంటేజ్‌గా మారిందన్నారు. కృష్ణా, గోదావరి జలాలను సక్రమంగా వాడుకుంటే ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ ఉండేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణకు 299 టీఎంసీలు చాలని అంగీకరిస్తూ పదేళ్ల కాలానికి కేసీఆర్ సంతకం చేశారని గుర్తు చేశారు.

ఇవాళ 'నీళ్లు-నిజాలు' అంశంపై ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వ్యయాన్ని రూ.30,000 కోట్ల నుంచి రూ.80,000 కోట్లకు పెంచారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ న...