Hyderabad, ఫిబ్రవరి 3 -- బ్రౌన్ రైస్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందుకే దంపుడు బియ్యం తినడం ఎంతో ఆరోగ్యకరమని చెబుతారు. ప్రతి రోజూ ఒకపూట బ్రౌన్ రైస్ తినడం వల్ల మలబద్దకాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఒక కప్పు బ్రౌన్ రైస్ తింటే చాలు త్వరగా పొట్ట నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఈ దంపుడు బియ్యం తినడం వల్ల మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ బ్రౌన్ రైస్‌లో ఫైటోకెమికల్స్, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని నివారించడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ రెండు పూటలా బ్రౌన్ రైస్ తినలేకపోతే కనీసం ఒకపూటైనా తినేందుకు ప్రయత్నించాలి. ఇలా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్దకాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. బ్రౌన్ రైస్ కొంచెం తిన్నా చాలు పొట్ట నిండిన అనుభూతిని కలిగిస్తుంది. మల...