భారతదేశం, అక్టోబర్ 27 -- పెళ్లికూతురంటే బోలెడు వస్తువులు కొనుక్కోవాలి. ఎంత షాపింగ్ చేసినా ఏదో ఒకటి మిగిలిపోయే ఉంటుంది. ముఖ్యంగా మేకప్ కిట్ విషయంలో జాగ్రత్తలు అవసరం. అందులో కేవలం మేకప్ కోసమే కాకుండా మీకు అత్యవసరంలో ఉపయోగపడే కొన్ని వస్తువులూ ఉంచుకోవాలి. అనుకోని ఇబ్బంది వచ్చినా కూడా ఈ చిన్న వస్తువులు మిమ్మల్ని కాపాడతాయి. అవేంటో చూసేయండి.

పెళ్లికూతురు లుక్‌లో ముఖ్యమైంది నుదుటన తిలకం. మేకప్ లుక్ మార్చేస్తుందిది. మీ ముఖం ఆకారం తగ్గట్లు సరైన బింది ఎంచుకోండి. మీ బ్రైడల్ కిట్ లోనూ బింది బుక్ ఒకటి ఉంచుకోండి. స్టిక్కర్ ప్యాకెట్ కన్నా కూడా బింది బుక్ అవసరానికి బాగా పనికొస్తుంది. దీంట్లో రకరకాల ఆకారాలు, అన్ని రంగుల్లో స్టిక్కర్లుంటాయి. అవసరానికి తగ్గట్లు మీ లుక్ మార్చేసుకోవచ్చు.

డబుల్ సైడెడ్ టేప్ ఉపయోగం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కొంగు బ్లవుజు దగ...