భారతదేశం, ఆగస్టు 5 -- ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుండి 7 వరకు ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటారు. తల్లులు పాలివ్వడం యొక్క ప్రాముఖ్యతను, తల్లి పాలివ్వడం వల్ల శిశువుకు, తల్లికీ ఉండే ప్రయోజనాలను తెలియజేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాది థీమ్ 'గ్యాప్ క్లోజింగ్ - బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్'. దీని అర్థం తల్లి పాలివ్వడం గురించి అందరూ అవగాహనతో ఉండాలి.తల్లులు శిశువుకు పాలు పట్టడంలో ఎక్కడా ఇబ్బంది పడకుండా చూసుకోవాలి.

ఇక తల్లిపాలు పట్టే విషయంలో బ్రెస్ట్ పంప్ వాడటం ఉత్తమమేనా లేదా నేరుగా పిల్లలకు పాలు పడితేనే పూర్తి ప్రయోజనాలు పొందగలమా అనే గందరగోళం ప్రతి తల్లిలో ఉంటుంది. దీని గురించి డాక్టర్ వైశాలి శర్మ స్పష్టమైన వివరణ ఇచ్చారు.

నవజాత శిశువు జన్మించిన వెంటనే, తల్లి పాలు పట్టడానికి రెండు మార్గాలుంటాయి. ఒకటి నేరుగా పాలివ్వడం, రెండోది బ...