Hyderabad, ఫిబ్రవరి 4 -- Breakup Kahani OTT: ఓటీటీలోకి యూత్ ను అలరించే మరో ఇంట్రెస్టింగ్ ఆంథాలజీ రాబోతోంది. ఈ సరికొత్త ఆంథాలజీ సిరీస్ ను సన్ నెక్ట్స్ లో చూడొచ్చు. ఈ విషయాన్ని మంగళవారం (ఫిబ్రవరి 4) తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఆ ఓటీటీ వెల్లడించింది. ఈ ఆంథాలజీ పేరు బ్రేకప్ కహానీ కావడం విశేషం. ఈ సందర్భంగా ఓ టీజర్ ను కూడా సన్ నెక్ట్స్ రిలీజ్ చేసింది.

బ్రేకప్ కహానీ ఓ ఆంథాలజీ. అంటే కొన్ని వేర్వేరు కథల సమాహారం. జీవితాంతం కలిసి ఉండాల్సిన రిలేషన్షిప్ ను ఈకాలం జంటలు మధ్యలోనే ఎలా బ్రేకప్ చెప్పేస్తున్నారో, అలా బ్రేకప్ చెప్పడానికి చిన్న చిన్న విషయాలు కూడా ఎలా కారణమవుతున్నాయో ఈ ఆంథాలజీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బ్రేకప్ కహానీ బుధవారం (ఫిబ్రవరి 5) నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

"రొమాన్స్, రిలేషన్షిప్స్ తమదైన దారి...