Hyderabad, ఫిబ్రవరి 21 -- ప్రేమికులకు మాత్రమే కాదు, విడిపోయే వారికి కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉంటుంది. అదే బ్రేకప్ డే. వాలెంటైన్స్ వీక్ తర్వాత వచ్చే యాంటీ వాలెంటైన్ వీక్‌లో చివరి రోజున ఈ బ్రేకప్ డే జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన జరుపుకునే బ్రేక్ డే ఉద్దేశం ఏంటి, ఈ రోజును ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో తెలుసుకుందాం.

ప్రేమ చాలా గొప్పది, మధురమైనది అంటారు. కానీ నిజానికి అందరి ప్రేమ అంతే తీయగా ఉంటుందనేం లేదు. కొందరికి ఇది తీవ్రమైన బాధను కలిగిస్తుంది. ముళ్లులా మారి గుచ్చుకుంటుంది.ప్రియుడు లేదా ప్రేయసితో జీవితం నరకంగా మారుతుందేమో అని భయంగా అనిపిస్తుంది.అయినప్పటికీ విడిపోలేక బలవంతంగా వారిని భరిస్తూ ఉంటారు కొందరు. అలాంటి వారి కోసం ప్రత్యేకంగా కేటాయించినదే ఈ బ్రేకప్ డే. భాగస్వామితో ఉన్న సంబంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవడానికి, విషపూరిత సంబంధాలన...