Hyderabad, ఏప్రిల్ 4 -- సాయంత్రం కాగానే రుచిగా, కాస్త స్పైసీగా ఏదైనా తినాలని చాలా మంది కోరుకుంటారు. స్కూలు నుంచి పిల్లలు అమ్మ రుచిగా ఏదో ఒకటి చేసి పెడుతుంది అని ఆశగా వస్తుంటారు. ఒక్కోసారి ఇంట్లో ఏమీ ఉండవు కడుపులో ఆకలి దంచి కొడుతుంటుంది. అంతేకాదు.. కొన్నిసార్లు ఆఫీసు నుంచి వచ్చే సరికి ఆడవారికి వంట చేసే ఓపిక కూడా ఉండదు.

మీ ఇంట్లో కూడా ఇలాంటి మనుషులు, ఇలాంటి పరిస్థితులు ఉండి ఉంటే.. మీకు ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుంది. సింపుల్ గా, ఈజీగా తయారయ్యే కేవలం పదే పది నిమిషాల్లో తయారు చేసుకునే పదార్థాన్ని మీకు పరిచయం చేస్తున్నాం. దీనికోసం బ్రెడ్డూ, గుడ్లు ఉంటే చాలు. ఈ వంటకం రుచిలో అద్భుతంగా ఉండటం మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలోనూ ముందుంటుంది. దీన్ని సాయంత్రం సమయంలో స్నాక్స్ గా తినచ్చు, ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా తినచ్చు. పిల్లల నుంచి...