Hyderabad, మార్చి 28 -- బ్రెయిన్ ట్యూమర్ ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటి. దాని లక్షణాలను ప్రారంభ దశలో గుర్తించడం కొంచెం కష్టమే, కానీ అసాధ్యం మాత్రం కాదు. లక్షణాలు కనిపించినప్పటికీ, చాలా మంది వాటిని సాధారణ ఆరోగ్య సమస్యలుగా భావించి మర్చిపోతారు. బ్రెయిన్ ట్యూమర్ వస్తే కనిపించే అత్యంత సాధారణ లక్షణం దీర్ఘకాలిక తలనొప్పి. దీన్ని చాలా మంది పట్టించుకోరు. మానసిక ఆందోళన, డీహైడ్రేషన్ వంటి సమస్యల వల్ల కూడా తలనొప్పి వస్తుంది. కానీ బ్రెయిన్ ట్యూమర్ సూచించే ప్రారంభ లక్షణాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.

బ్రెయిన్ ట్యూమర్స్ కు సంబంధించిన లక్షణాల్లో తలనొప్పి సాధారణమేనని వైద్యులు చెబుతున్నారు. ఈ తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. కొన్నిసార్లు రోజులో ఎక్కువ సార్లు తతలనొప్పి రావచ్చు. కొందరికి ఉదయం పూట తలనొప్పి వచ్చి వాంతులు కూడా అవుతాయి. ఇలా తలనొప్పి పదే పదే వస్తుంటే నిర్...