Hyderabad, ఫిబ్రవరి 13 -- ప్రపంచానికి ముప్పుగా మారిన వాటిలో ప్లాస్టిక్ ఒకటి. ఇది త్వరగా నశించదు. దీని వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పుగా మారింది. ప్లాస్టిక్ ను కనుగొన్నది మనిషే. ప్రపంచంలో ప్లాస్టిక్ అనేక రకాలుగా ఉపయోగపడుతోంది. అదే విధంగా దాని వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, మానవ మెదడులో ప్లాస్టిక్ కణాలు ఉన్నాయని ఒక అధ్యయనం వెల్లడించింది.

కాలేయం, మూత్రపిండాల వంటి ఇతర అవయవాలతో పోలిస్తే మెదడు కణజాలంలో మైక్రోప్లాస్టిక్స్ 12 రెట్లు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనం కనుగొంది. న్యూ మెక్సికో విశ్వవిద్యాలయం నిర్వహించిన ఈ అధ్యయనం, ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌లో సాధారణంగా కనిపించే పాలిథిన్ కణాలు మెదడు కణజాలంలో సాధారణంగా కనిపిస్తున్నాయని చూపిస్తుంది. డిమెన్షియా ఉన్న వ్యక్తుల మెదడు నమూనాలలో డిమెన్షియా లేని వారి కంటే పది ర...