Hyderabad, ఫిబ్రవరి 11 -- పిల్లలకైనా, పెద్దలకైనా తీపి వంటకాలు అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా భోజనం తర్వాత తీపి పదార్థం తినేందుకు ఇష్టపడతారు. లేకకుంటే భోజనం అసంపూర్ణంగా పూర్తి చేసినట్టు అనిపిస్తుంది. అయితే తీపి వంటకాల గురించి కొంత భయం కూడా ఉంటుంది. అధికంగా తీపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ ఇంట్లో తయారుచేసే కొన్ని తీపి వంటకాలు మన ఆరోగ్యానికి, ముఖ్యంగా మెదడు ఆరోగ్యానికి చాలా మంచివి. పరిమిత మోతాదులో వీటిని తీసుకోవడం ద్వారా రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. మెదడుకు మేలు చేసే స్వీట్ల గురించి ఇక్కడ ఇచ్చాము. ఇవి ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. మీ పిల్లలకు ఆరోగ్యంగా మీరే వీటిని వండి తినిపించవచ్చు.

పోషకాలతో నిండిన మఖానాలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. మఖానాలలో జింక్, ఇనుము ఉంటాయి, ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచుతా...