Hyderabad, ఫిబ్రవరి 15 -- మనలో చాలా మంది ఆరోగ్యానికి హానికరంగా భావించే చాక్లెట్ చేసే మేలు తెలిస్తే కచ్చితంగా మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. అంతేకాదు, దాంతో పాటు చీజ్, వైన్ కూడా మీ ఆయుష్షును పెంచుతాయట. అల్జీమర్స్ వ్యాధిపై జరిపిన స్టడీలో ఈ మూడు పదార్థాలు ఆయుష్షును పెంచాయని తేలింది. వీటిని రోజూ మితంగా తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడిందట. ఈ విషయంపై 1,787 మందిపై 10 సంవత్సరాల పాటు అధ్యయనం నిర్వహించారు.

రెడ్ వైన్, చీజ్, చాక్లెట్ వంటివి సాధారణంగా ఆరోగ్యకరమైన ఫుడ్ లిస్ట్‌లో చేర్చారు. వీటిని మితంగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుందని పరిశోధకులు సూచిస్తున్నారు. అమెరికన్ నేషనల్ కాన్సర్ ఇన్స్టిట్యూట్ 2022లో నిర్వహించిన అధ్యయనంలో, రోజూ 12 గ్రాముల డార్క్ చాక్లెట్ తీసుకున్న వారిలో గుండె జబ్బులు, దానిత...