Hyderabad, మార్చి 20 -- Brahmanandam On Saptagiri In Pelli Kani Prasad Event: సప్తగిరి హీరోగా నటిస్తున్న మరో లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ పెళ్లి కాని ప్రసాద్. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సప్తగిరికి జోడీగా ప్రియాంక శర్మ హీరోయిన్‌గా చేసింది.

అన్నపూర్ణ, ప్రమోదిని ఇతర కీలక పాత్రలు పోషించిన పెళ్లి కాని ప్రసాద్ సినిమా థామ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మించారు. దిల్ రాజు నేతృత్వంలోని ఎస్‌వీసీ పెళ్లి కాని ప్రసాద్ సినిమాను విడుదల చేస్తోంది. ఇప్పటికే ట్రైలర్, టీజర్ బజ్ క్రియేట్ చేసిన పెళ్లి కాని ప్రసాద్ మూవీని మార్చి 21న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో మార్చి 20న గ్రాండ్‌గా పెళ్లి కాని ప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మారుతి, న...