భారతదేశం, ఫిబ్రవరి 13 -- వంద కోట్ల అప్పును గ‌డువు లోగా రాజ్‌, కావ్య చెల్లించ‌క‌పోవ‌డంతో ఆస్తుల‌ను జ‌ప్తు చేస్తామంటూ బ్యాంకు అధికారులు ఇంటికొస్తారు. ఆస్తిలో మా వాటాలు మాకు పంచి ఇచ్చిన త‌ర్వాతే ఆస్తుల‌ను జ‌ప్తు చేయాల‌ని బ్యాంకు ఆఫీస‌ర్ల ముందే రాజ్‌, కావ్య‌ల‌తో రుద్రాణి, ధాన్య‌ల‌క్ష్మి గొడ‌వ‌ప‌డ‌తారు.

అప్పుడే సీతారామ‌య్య హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికొస్తాడు. ఆస్తుల కోసం కుటుంబ‌స‌భ్యులు గొడ‌వ‌లు ప‌డ‌టం చూసి బాధ‌ప‌డ‌తాడు. మీ స్వార్థం కోసం నా ప‌రువు మ‌ర్యాద‌లు తీయాల‌ని చూస్తున్నార‌ని రుద్రాణి, ధాన్య‌ల‌క్ష్మిపై ఫైర్ అవుతాడు. మీకు నా మాటే అక్క‌ర‌లేన‌ప్పుడు నేను సంపాదించిన ఆస్తి మీకు ఎలా ఇస్తాను? నా ప‌రువు మ‌ర్యాద‌లే మీకు అక్క‌ర‌లేన‌ప్పుడు మీరు నాకు అక్క‌ర‌లేద‌ని షాకిస్తాడు.

బ్యాంకు వాళ్ల‌కు ఎంత అప్పుందో...అంత మ‌న ఆస్తులు అమ్మి క‌ట్టేయ...