భారతదేశం, మార్చి 7 -- Brahmamudi Today Episode: కావ్య‌ను ప‌ట్టించుకోకుండా ఆఫీస్ వ్య‌వ‌హారాల్లో మునిగిపోతున్న రాజ్‌కు క్లాస్ ఇస్తారు అప‌ర్ణ‌, ఇందిరాదేవి. అత‌డిని రౌండ‌ప్ చేసి ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తారు. నీకు అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు కావ్య‌ను ఆఫీస్‌కు తీసుకెళ్లి ప‌నిచేయించుకున్నావు త‌ప్పితే త‌న‌కు ఏమైనా కావాలా అని ఎప్పుడైనా అడిగావా అని కొడుకును నిల‌దీస్తుంది అప‌ర్ణ‌.

కొన్ని రోజులు ఆఫీస్ ప‌నులు ప‌క్క‌న‌పెట్టి కావ్య‌తో కలిసి హ‌నీమూన్ వెళ్లాల‌ని రాజ్‌కు ఆర్డ‌ర్ వేస్తుంది అప‌ర్ణ‌. పెళ్లై రెండేళ్ల త‌ర్వాత ఇప్పుడు హ‌నీమూన్ ఏంటి అని ఫిట్టింగ్ పెట్ట‌బోతుంది రుద్రాణి. క‌రివేపాకు ఏదో కూసింది దాని మాట‌లు ప‌ట్టించుకోవ‌ద్దు అంటూ రుద్రాణికి కౌంట‌ర్ వేస్తుంది ఇందిరాదేవి.

హ‌నీమూన్ అంటే ప్లాన్ చేసుకోవాలి ఇప్ప‌టికిప్పుడు కుద‌ర‌ద‌ని రాజ్ త‌ప్పించుకోవాల‌ని ...