భారతదేశం, ఫిబ్రవరి 12 -- Brahmamudi February 12th Episode: రాజ్‌, కావ్య వంద కోట్లు అప్పు చేశార‌ని చెప్పి ఇద్ద‌రిని దుగ్గిరాల కుటుంబ‌స‌భ్యుల ముందు ఇరికిస్తుంది అనామిక‌. ఆమె మాట‌లు నిజ‌మ‌ని న‌మ్మిన రుద్రాణి, ధాన్య‌ల‌క్ష్మి ర‌చ్చ చేస్తారు. ఆస్తుల్లో వాటాలు పంచ‌కుండా అడ్డుకోవ‌డానికే అప్పుల పేరుతో డ్రామాలు ఆడుతున్నార‌ని గొడ‌వ‌కు దిగుతారు.

ధాన్య‌ల‌క్ష్మి ఎంత చెప్పిన క‌ళ్యాణ్ మాత్రం రాజ్‌, కావ్య‌ల‌నే స‌మ‌ర్థిస్తాడు. ఆస్తిలో మ‌న వాటా మ‌నం తీసుకొని వెంట‌నే ఇక్క‌డి నుంచి బ‌య‌ట‌ప‌డ‌దామ‌ని క‌ళ్యాణ్, ప్ర‌కాశంల‌తో చెబుతుంది ధాన్య‌ల‌క్ష్మి.

బంధాలు, బంధుత్వాలు మాట్లాడుకోవ‌డానికే ప‌నికొస్తాయ‌ని, జీవితంలో గెల‌వాలంటే డ‌బ్బు మాత్రం ప‌నికొస్తుంద‌ని అంటుంది. ఇన్ని రోజుల్లో అన్న‌య్య దారిలో న‌డిచి త‌ప్పు చేశాను, ఇప్పుడు నువ్వే అదే ప‌ని చేస్తున్నావు...అమ్మ చెప్...