భారతదేశం, ఫిబ్రవరి 7 -- పోలీస్ ఆఫీస‌ర్ జాబ్‌లో జాయిన్ అయిన అప్పు...దుగ్గిరాల ఇంటికి వ‌స్తుంది. ఏంటి ఈ ద‌స‌రా వేషం అంటూ అప్పును పోలీస్ డ్రెస్‌లో చూసి కామెంట్ చేస్తుంది రుద్రాణి. అలాంటి వేషాలు వేయ‌డం మీకు అల‌వాటు నా చెల్లెలికి కాద‌ని కావ్య కౌంట‌ర్ వేస్తుంది. అప్పు పోలీస్ ట్రైనింగ్ పూర్తిచేసుకొని ఇదే ఊళ్లో ఎస్ఐగా పోస్టింగ్ తీసుకున్న‌ట్లు కావ్య చెబుతుంది.

నిన్ను, నీ మొగుడిని అవ‌మానించిన మీ అత్త‌కు వార్నింగ్ ఇవ్వ‌డానికి వ‌చ్చావా? దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేయ‌డానికి వ‌చ్చావా అంటూ రుద్రాణి త‌న నోటికి ప‌నిచెబుతుంది. మీ మ‌న‌సులో ఉన్న ఆలోచ‌న‌ల‌ను మా మాట‌లుగా చెప్పాల‌ని ఎందుకు అనుకుంటున్నార‌ని రుద్రాణి మాట‌ల‌ను క‌ళ్యాణ్ అడ్డుకుంటాడు. ఈ ఇంటి పెద్ద‌ల ఆశీర్వాదం తీసుకోవ‌డానికి మాత్ర‌మే వ‌చ్చామ‌ని చెబుతాడు.

అనుకున్న‌ది సాధించిన మీరు జీవితాంతం పిల్ల‌ప...