భారతదేశం, ఫిబ్రవరి 17 -- బ్యాంకు అప్పు స‌మ‌స్య‌ను క్రియేట్ చేసింది అనామిక‌, సామంత్ అనే నిజం బ‌య‌ట‌పెడుతుంది అప్పు. నంద‌, విశ్వ వెన‌కుండి ఈ క‌థ మొత్తం వాళ్లే న‌డిపించార‌ని అంటుంది. అప్పు మాట‌లు విన‌గానే రాజ్ కోపంతో ర‌గిలిపోతాడు. ఈ సారి వాళ్ల‌ను వ‌దిలేది లేద‌ని కోపంగా అనామిక ద‌గ్గ‌ర‌కు బ‌య‌లుదేరుతాడు. రాజ్ వెంట కావ్య వెళుతుంది.

మ‌రోవైపు సామంత్ టెన్ష‌న్‌గా క‌నిపిస్తాడు. అనామిక మాట‌లు న‌మ్మి త‌న కంపెనీ న‌డ‌వ‌టం కోసం ఐదు కోట్ల అప్పు చేస్తాడు. ఇద్ద‌రు క్ల‌యింట్స్‌ను అనామిక తీసుకొస్తుంది. వాళ్లు ఒప్పుకోక‌పోతే త‌న కంపెనీ మూత‌ప‌డ‌టం ఖాయ‌మ‌ని సామంత్ భ‌య‌ప‌డ‌తాడు. అప్పుడే నంద దొరికిపోయాడ‌నే నిజం సామంత్‌కు తెలుస్తుంది. నంద దొర‌క‌డం అసాధ్య‌మ‌ని, స‌మ్‌థింగ్ ఈజ్ రాంగ్ అని అనామిక అంటుంది. అస‌లు నువ్వు చేసే ప‌నుల‌న్నీ రాంగే అని అనామిక‌పై ఫైర్ అవుతాడు సామ...