భారతదేశం, ఏప్రిల్ 9 -- యామినితో క‌లిసి గుడికి వ‌చ్చిన రాజ్‌ను చూస్తుంది రుద్రాణి. రాజ్ బ‌తికే ఉన్న సంగ‌తి కుటుంబ‌స‌భ్యుల‌కు చెబుతుంది. రాజ్‌ను చూడ‌గానే అప‌ర్ణ ఎమోష‌న‌ల్ అవుతుంది. కానీ రాజ్ మాత్రం త‌ల్లిని గుర్తుప‌ట్ట‌డు. మిమ్మ‌ల్ని ఇదే మొద‌టిసారి చూస్తున్నాన‌ని, ఎవ‌రు మీరు అని అంటాడు.

అత‌డు రాజ్ కాద‌ని, త‌న బావ రామ్ అని యామిని బుకాయిస్తుంది. చిన్న‌త‌నంలోనే రాజ్ అమ్మ‌, నాన్న చ‌నిపోయార‌ని,మా బావ మా ద‌గ్గ‌రే పెరిగాడ‌ని, త్వ‌ర‌లోనే మేమిద్ద‌రం పెళ్లిచేసుకోబోతున్నామ‌ని అప‌ర్ణ‌తో గొడ‌వ‌ప‌డుతుంది యామిని.

రాజ్ కూడా యామిని త‌న‌కు కాబోయే భార్య అని అంటాడు. రాజ్ మాట‌లు, ప్ర‌వ‌ర్త‌న చూసి అప‌ర్ణ‌తో పాటు దుగ్గిరాల ఫ్యామిలీ షాక‌వుతారు. నీకు ఆల్రెడీ పెళ్లైపోయింద‌ని, పెళ్లాంతో ఏడాదిన్న‌ర కాపురం చేశావు...ఇప్పుడు మ‌ళ్లీ పెళ్లి ఏంటి అని రాజ్‌పై ఫైర్ అవుతుంది...