భారతదేశం, ఏప్రిల్ 11 -- స్టార్ మాలో చాలా కాలంగా నంబ‌ర్‌వ‌న్ సీరియ‌ల్స్‌లో ఒక‌టిగా కొన‌సాగుతోంది బ్ర‌హ్మ‌ముడి.ఒక‌ప్పుడు టీఆర్‌పీ రేటింగ్‌లో బ్ర‌హ్మ‌ముడి నంబ‌ర్‌వ‌న్‌లో నిలుస్తూ వ‌చ్చింది. కార్తీక దీపం 2, గుండె నిండా గుడి గంట‌లు వంటి సీరియ‌ల్స్‌కు గ‌ట్టి పోటీ ఇచ్చింది. సీరియ‌ల్ టైమ్ ఛేంజ్ కావ‌డంతో రేటింగ్ దారుణంగా ప‌డిపోయింది. నంబ‌ర్ వ‌న్ ప్లేస్ నుంచి ఒక్క‌సారిగా టాప్ టెన్‌లోకి ప‌డిపోయింది. ప్ర‌స్తుతం మ‌ధ్యాహ్నం ఒంటిగంట‌కు స్టార్ మాలో ఈ సీరియ‌ల్ టెలికాస్ట్ అవుతోంది.

లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌లో బ్ర‌హ్మ‌ముడి 6.73 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది. బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌లో మాన‌స్ నాగుల ప‌ల్లి, దీపికా రంగ‌రాజు లీడ్ రోల్స్‌లో న‌టిస్తోన్నారు. ష‌ర్మిత గౌడ‌, నైనిషా రాయ్, శ్రీప్రియ శ్రీక‌ర్‌, గిరి శంక‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్నారు.

బ్ర‌హ్మ‌ముడి ...