Hyderabad, ఫిబ్రవరి 9 -- Brahma Mudi Serial Latest Episode Promo: బ్రహ్మముడి సీరియల్‌ తాజా ఎపిసోడ్‌‌ ప్రోమోలో స్వప్నకు పాప పుట్టడంతో దుగ్గిరాల కుటంబంలో సంతోషం విల్లివిరిస్తుంది. అంతా సంతోషంగా ఉంటారు. కానీ, రుద్రాణి మాత్రం అది చూసి ఓర్వలేకపోతుంది. దాంతో అనామికకు కాల్ చేస్తుంది.

ఇంట్లో ప్రతి ఒక్క విషయం నీకు చెబుతూ వచ్చాను. నువ్ ఏదోదో చేస్తాను అన్నావ్. కానీ, ఏం చేయలేదు. ఏమైపోయింది నీ పగ, ప్రతికారం. నీలో పౌరుషం తగ్గిపోయిందా, లేక ధైర్యమే చచ్చిపోయిందా అని అనామికతో అంటుంది రుద్రాణి. వీళ్ల మొహాల్లో నవ్వులు చూడలేకపోతున్నా అని రుద్రాణి అంటుంది. దాంతో మృగాలు సైలెంట్‌గా ఉన్నాయంటే వేటాడటం లేదని కాదు. సరైన అవాకశం కోసం ఎదురుచూస్తున్నట్లు, నేను కూడా అదే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను అని అనామిక అంటుంది.

ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. అదే మీ మనవరాలి బారసాల. ...