Hyderabad, మార్చి 16 -- Brahma Mudi Serial Latest Episode Promo: బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో రాజ్, యామిని బయటకు వెళ్తారు. కారులో వెళ్తూ ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. ఈ క్రమంలోనే రాజ్‌ చేయి తీసుకుని ముద్దు పెడుతుంది యామిని. దాంతో రాజ్ ఇబ్బందిగా ఫీల్ అవుతాడు.

నువ్ ఇబ్బందిగా ఫీల్ అయిన సరే ఈమాత్రం సైలెంట్‌గా ఉంటే చాలు నేను అనుకుంది నెరవేర్చుకుంటా అని యామిని అనుకుంటుంది. మరోవైపు కారులో వెళ్తున్న కావ్య రాజ్‌ను చూసేస్తుంది. డ్రైవర్ యాదగిరిని కారు ఆపమని రాజ్ కారు వెనుక పరుగెత్తుతుంది. ఏం తినకపోవడంతో కాసేపటికే అలసిపోతుంది. అయినా కారు వెంట పరుగెత్తుతూనే ఉంటుంది. ఓపిక లేక ఓ చోట మాత్రం కావ్య ఆగిపోతుంది.

అప్పుడే కావ్యకు కొద్దిదూరంలో రాజ్ కారు ఆగుతుంది. డిజైనర్ చీర తెచ్చుకోవాలని యామిని కారు దిగి వెళ్లిపోతుంది. కారు ఆగడం చూస...