Hyderabad, మార్చి 30 -- Brahma Mudi Serial Latest Episode Promo: బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో రాజ్‌ ఆరు నెలలు కోమాలో లేడని, అదంతా యామిని ఆడిస్తున్న నాటకం అని డాక్టర్ సతీష్ కావ్య, అప్పులతో నిజం చెప్పేస్తాడు. దాంతో ఎమోషనల్ అయిన కావ్య హాస్పిటల్‌లో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్లి నేను అనుకుందే జరిగింది, మా ఆయన్ను కాపాడవ్, ఇంతకుమించి ఏం వద్దని సంతోషపడుతుంది.

ఇంతలో కావ్యకు కాస్తా దూరంగా రాజ్ వస్తాడు. అది చూసి భర్త దగ్గరికి వెళ్దామనుకుని రాజ్ కండిషన్ గుర్తుకు వచ్చి ఆగిపోతుంది కావ్య. అప్పుడే అప్పు వస్తే రాజ్‌ను కావ్య చూపిస్తుంది. అప్పుడు రౌడీ బేబీ తన బావ రాజ్‌ను చూసి ఆశ్చర్యపోతుంది. పద మాట్లాడు అని కావ్యను అంటుండగా.. రాజ్ దగ్గరికి యామిని వచ్చి కౌగిలించుకుంటుంది. పెళ్లికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ చెబుతుంది. దాంతో కావ్య, అప్పు షాక్...