Hyderabad, మార్చి 23 -- Brahma Mudi Serial Latest Episode Promo: బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో రాజ్‌ను రామ్‌గా గతం మార్చి చూపించేందుకు ఓ స్కూల్‌కు తీసుకెళ్తుంది యామిని. అక్కడ ప్రిన్సిపల్‌ను ఇద్దరు కలుస్తారు. వారిని ఫాలో అవుతూ వచ్చిన కావ్యను వాచ్‌మెన్ అడ్డుకుంటాడు. అతనికి పెళ్లి చూపులు చూస్తున్నారనే కారణాన్ని ఆసరాగా చేసుకుని అప్పును ఎరగా వేసి లోపలికి వెళ్తుంది కావ్య.

యామిని, రాజ్‌లతో ప్రిన్సిపల్ మాట్లాడేది కిటికీ పక్కన నిలబడి వింటుంది కావ్య. రాజ్ గురించి గొప్పగా, బాగా తెలిసినట్లుగా చెబుతుంది ప్రిన్సిపాల్. రామ్ చాలా బాగా చదివేవాడని, ఇంటలిజెంట్ అని, యామిని అల్లరి పిల్ల అని, తనను ఎప్పుడు కంట్రోల్ చేసందుకు రామ్ సతమతం అయ్యేవాడని ప్రిన్సిపల్ చెబుతుంది. అవన్ని విన్న రాజ్ ఏం గుర్తులేనట్లుగా బిహేవ్ చేస్తాడు.

ఆ మాటలన్నీ విన్న కావ...