Hyderabad, ఫిబ్రవరి 2 -- Brahma Mudi Serial Latest Episode Promo: బ్రహ్మముడి సీరియల్‌ తాజా ఎపిసోడ్‌‌ ప్రోమోలో రాజ్, కావ్య పాస్‌పోర్ట్, వీసాకు కావాల్సిన డాక్యుమెంట్స్ కోసం బ్రోకర్ సతీష్ వస్తాడు. అతనితో అవి ఎవరికి అని చెప్పిస్తుంది రుద్రాణి. తర్వాత ఆస్తులన్నీ తాకట్టుపెట్టి డాలర్స్‌కు మార్చి అమెరికాలో సెటిల్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు రుద్రాణి చెబుతుంది. దానికి అపర్ణ తప్పు బడుతుంది.

నాకు న్యాయం చేయాలని మాట్లాడితే మీకెందుకు తప్పుగా అనిపిస్తుందో అని ధాన్యలక్ష్మీ నిందిస్తుంది. అపర్ణ, సుభాష్‌లతో గొడవ పెట్టుకుంటుంది. మీ కొడుకు, కోడలు సంతోషంగా ఉంటే చాలు అని సైలెంట్‌గా ఉంటున్నారు అంటుంది. ఇప్పుడు వీరికి ఇంత అర్జంట్‌గా అమెరికా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది, విదేశాల్లో సెటిల్ అవ్వాలనే ఆలోచన లేకపోతే తప్పా అని రెచ్చిపోతుంది ధాన్యలక్ష్మీ. దానికి రుద్ర...