భారతదేశం, ఫిబ్రవరి 16 -- దుగ్గిరాల ఆస్తిని జ‌ప్తు చేసేందుకు బ్యాంకు అధికారులు సిద్ధ‌మ‌వుతారు. ఇంటితో పాటు అంద‌రి న‌గ‌లు ఇచ్చేయాల‌ని బ్యాంకు ఆఫీస‌ర్లు అడుగుతారు. త‌న న‌గ‌లు ఇవ్వ‌కుండా దాచేస్తుంది రుద్రాణి. న‌గ‌లు ఇవ్వాల్సిందేన‌ని ధాన్య‌ల‌క్ష్మి, స్వ‌ప్న ప‌ట్టుప‌ట్ట‌డంతో త‌న‌కు ఈ ఇంటికి అస‌లు సంబంధ‌మే లేద‌ని, తాను ఈ ఇంటి ఆడ‌ప‌డుచును కాద‌ని ప్లేట్ ఫిరాయిస్తుంది. రుద్రాణి దాచిన న‌గ‌ల‌ను స్వ‌ప్న బ‌య‌ట‌కు తీసి బ్యాంకు ఆఫీస‌ర్ల ముందు పెడుతుంది.

ఆస్తి మొత్తాన్ని బ్యాంకు ఆధికారుల‌కు సీతారామ‌య్య రాసిస్తోన్న టైమ్‌లోనే నంద‌గోపాల్‌తో అక్క‌డికి ఎంట్రీ ఇస్తుంది అప్పు. నంద‌గోపాల్‌తో పాటు ఎస్ఐ విశ్వ చేసిన మోసాన్ని బ‌య‌ట‌పెడుతుంది. స్నేహితుడైన విశ్వ తనకు ద్రోహాన్ని తలపెట్టాలని చూడటం రాజ్ తట్టుకోలేకపోతాడు. పోలీస్‌గా డ్యూటీ స‌రిగ్గా చేయ‌డ‌మే కాకుండా కోడ‌లిగ...