Hyderabad, మే 6 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో రాజ్ సర్, మాయ మేడమ్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. వాళ్లను చూడగానే నాకు అనుమానం వచ్చి వినడం మొదలు పెట్టాను అని కేర్ సెంటర్ అతను చెబుతాడు. ఏం మాట్లాడుకున్నారు అని కావ్య అడుగుతుంది. దాంతో అప్పుడు జరిగింది చూపిస్తారు. ఈవిడ ఏంటీ రోజు బాబును ఇక్కడ వదిలేసి వెళ్లేది. ఈవేళ సెంటర్‌లో వదలకుండా ఇక్కడ ఏం చేస్తుంది అని అనుకుంటాడు.

బెదిరించడానికి వచ్చావా అని రాజ్‌ను మాయ అడుగుతుంది. బెదిరించడం ఆపమని చెప్పటానికి వచ్చాను అని రాజ్ అంటాడు. అలా ఆపితే నాకు నా బిడ్డకు న్యాయం ఎలా జరుగుతుంది అని మాయ అంటుంది. జరిగిందంతా మర్చిపో.. జరగాల్సింది నేను చూసుకుంటాను అని రాజ్ అంటాడు. ఎంతకాలం ఈ బిడ్డకు తండ్రి ఎవరో చెప్పకుండా నిందలు మోస్తూ బతకాలి. ఇప్పుడు నువ్ వచ్చి మాత్రం ఏం సాధిస్తావ్ అ...