Hyderabad, మే 18 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో రాజ్‌కు కావ్య కిడ్నాప్ అయిన విషయం చెబుతుంది అప్పు. దాంతో రాజ్ షాక్ అవుతాడు. మల్కాజిగిరి పాతబస్తీ దగ్గర నలుగురు వచ్చి కిడ్నాప్ చేశారు. మనం త్వరగా వెళ్లి కాపాడాలి బావ అని అప్పు అంటుంది. హేయ్.. కిడ్నాప్ చేయడం ఏంటీ. అక్కడికి ఎందుకు వెళ్లారు అని రాజ్ అడుగుతాడు. మాయ కోసం అని అప్పు చెబుతుంది.

మీ అక్కకు అసలు బుద్ధి లేదు అని రాజ్ అంటే.. అక్క దొరికాక బుద్ధి ఉందా లేదా అని సర్టిఫికేట్ ఇద్దురు గానీ. ఆ వ్యాన్ నెంబర్ ఉంది. వెళ్లేటప్పుడు ఫొటో తీశాను అని అప్పు అంటుంది. సరే పదా అని ఇద్దరు బయలుదేరుతారు రాజ్, అప్పు. మరోవైపు కావ్య ఉన్న చోట ఉన్న మిగతా అమ్మాయిలు అందరూ ఏడుస్తుంటారు. ఆపండి.. ఇలా ఏడిస్తే.. మనం బయటకు వెళ్తామా అని కావ్య అంటుంది. అంతకుమించి ఏం చేయగలం అక్కా. వాళ...