భారతదేశం, మార్చి 8 -- కావ్య‌, రాజ్ శ్రీశైలం బ‌య‌లుదేరుతారు. మ‌ధ్య‌లో రూట్ మార్చిన రాజ్‌....కావ్య‌ను భూత్ బంగ్లా వ‌ద్ద‌కు తీసుకొస్తాడు. లోప‌ల ఓ స‌ర్‌ప్రైజ్ ఉంద‌ని అంటాడు. కావ్య క‌ళ్లు మూసి లోప‌లికి తీసుకెళ‌తాడు. బిల్డింగ్ లోప‌ల అందంగా డెక‌రేట్ చేసి ఉంటుంది. ఆ డెక‌రేష‌న్ చూసి ఈ రోజు నా బ‌ర్త్ డే కాదు...మీ బ‌ర్త్ డే కాదు. మ‌న పెళ్లి రోజు కూడా కాద‌ని కావ్య అంటుంది.

వాట‌న్నింటికంటే నాకు ముఖ్య‌మైన రోజు అని రాజ్ బ‌దులిస్తాడు. తాత‌య్య మిమ్మ‌ల్ని మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా ప్ర‌క‌టించింది ఈ రోజే క‌దా అని రాజ్‌ను అడుగుతుంది కావ్య‌. నువ్వే నా జీవితానికి డైరెక్ట‌ర్ అని తెలుసుకున్న రోజు అని రాజ్ స‌మాధాన‌మిస్తాడు.

నీతో పెళ్ల‌యిన కొద్ది రోజుల‌కే నువ్వంటే ఏమిటో అర్థ‌మైపోయింద‌ని కావ్య‌తో అంటాడు రాజ్‌. నువ్వు నాతో గొడ‌వ ప‌డుతుంటే బాగా న‌చ్చేది అని చెబుతాడు. ...