భారతదేశం, మార్చి 6 -- Brahmamudi March 6th Episode: స్వ‌ప్న కూతురు గుక్క‌పెట్టి ఏడుస్తుంది. ఎంత బుజ్జ‌గించిన ఏడుపు ఆప‌క‌పోవ‌డంతో కావ్య వ‌చ్చి చిన్నారిని ఎత్తుకొని ఆడిస్తుంది. కావ్య పాట పాడ‌టంతో చిన్నారి ఏడుపు ఆపేస్తుంది. త‌ల్లివి కాకుండానే ఒక త‌ల్లిలా ఆ పాప‌ను ఎంతో బాగా ఆడించావ‌ని కావ్య‌ను మెచ్చుకుంటుంది ఇందిరాదేవి. నువ్వు...ఎప్పుడు త‌ల్లి అవుతావ‌ని కావ్య‌ను ప్ర‌శ్నిస్తుంది ఇందిరాదేవి.

పెళ్ల‌య్యాక త‌ల్లిగా మారాల‌ని ప్ర‌తి ఆడ‌పిల్ల క‌ల‌లు కంటుంది. కానీ త‌ను ఒక్క‌తే కోరుకుంటే స‌రిపోదు...భ‌ర్త కూడా పిల్ల‌లు కావాల‌ని అనుకోవాలి. ఇదే ప్ర‌శ్న‌ను వెళ్లి మీ మ‌న‌వ‌డు రాజ్‌ను అడ‌గండి అని ఇందిరాదేవితో చెబుతుంది కావ్య‌.

నేను అడ‌గ‌టం కాదు...పిల్ల‌లు కావాల‌నే ఆలోచ‌న రాజ్‌కు వ‌చ్చేలా నువ్వు చేయాల‌ని కావ్య‌కు క్లాస్ ఇస్తుంది ఇందిరాదేవి. పిల్ల‌లు ఉంటే బా...