Hyderabad, మార్చి 5 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్‌కు యామిని వాయిస్ మెసేజ్ పెడుతుంది. హాల్లో స్పెషల్ గిఫ్ట్ ఉందని, ఎవరు చూడకముందే వెళ్లి చూడమని చెబుతుంది. దాంతో కంగారుగా రాజ్ హాల్లోకి వెళ్లి చూస్తాడు. అక్కడ కాలేజ్‌లో యామిని రాజ్ కలిసి దిగిన ఫొటోలు ఒక్కొక్కటిగా పేర్చి ఉంటాయి. అవి ఒక్కొక్కటి చూసి రాజ్ షాక్ అవుతాడు.

మన గతం నీ దారి పొడవునా కనిపిస్తుందా. ఈ గతాన్ని నీ భార్య చూస్తే ఏం అవుతుంది, నీ ఇంట్లోవాళ్లు ఏమనుకుంటారు. అందరు నిద్రలేవకుండానే గతాన్ని నిద్రపుచ్చు లేకుంటే నీ భవిష్యత్తు గందరగోళంగా మారిపోతుంది అని యామిని అంటుంది. దాంతో ఒక్కో ఫొటో ఏరుతు తీసుకుంటాడు రాజ్. ఇంతలో సుభాష్ వస్తే ఫొటోలను పక్కన పెట్టుకుని సోఫాలో కూర్చుంటాడు రాజ్. సుభాష్ వచ్చి అటు జరగరా అని అంటే.. లేదు మీరే వెళ్లి అక్కడ కూర్...